సీరోలు(కురవి), అక్టోబర్ 3 : అప్పుల బాధతో మనస్తాపానికి గురై న ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. సీరోలు మండ లం కాంపల్లికి చెందిన మంద చంద్రశేఖర్ అలియాస్ బాబు (50)కు శనివారం ఉదయం ఖమ్మంకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై సుబ్బారావు తెలిపారు.