Rohit Sharma : భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అభిమానగణం ఎక్కువే. తనమార్క్ షాట్లతో అలరించే హిట్‌మ్యాన్ భారీ సిక్సర్లు, ఫుల్‌షాట్లు కొడుతుంటే స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా కొబ్బరి బోండంపై టీమిండియా స్టార్ బొమ్మను చాలా నేర్పుగా చెక్కాడు. ప్రస్తుతం ‘కోకోనట్ రోహిత్’ వీడియో నెట్టింట వైరలవుతోంది.
అభిమాన క్రికెటర్లపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వ్యక్తం చేస్తుంటారు. గతంలో ఒక కుర్రాడు క్యూబిక్ రూబ్స్తో పేసర్ మహమ్మద్ షమీ బొమ్మకు రూపమిచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ అభిమాని ఒకరు కొబ్బరి బోండంపై తన కళా ప్రావీణ్యాన్ని చూపించాడు. పొడవాటి కొబ్బరి బోండం పైభాగాన్ని హిట్‌మ్యాన్ రూపం వచ్చేలా తొలిచాడు.
Coconut sculpture art of Rohit Sharma made by a fan. 🥹 pic.twitter.com/5Fnj0tnEuQ
— Selfless⁴⁵ (@SelflessCricket) January 18, 2026
చిన్న కత్తితో అతడు ఎంతో నేర్పుగా.. రోహిత్ చిత్రాన్ని ఆవిష్కరించాడు. తలపై టోపీగా కొబ్బరి బోండం భాగాన్నే మలిచిన తీరు అభిమానులను అబ్బురపరుస్తోంది. సెల్ఫ్‌లెస్ అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోకోనట్ రోహిత్ అపురూపమైన చిత్రాన్ని చూసిన వారంతా ఈ కుర్రాడి ప్రతిభను కొనియాడుతున్నారు.
నిరుడు టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్.. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. సిడ్నీ వన్డేలో అజేయ శతకంతో చెలరేగిన అతడు.. స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్దగా రాణించలేదు. కివీస్‌పై మూడు మ్యాచుల్లో ఈ విధ్వంసక బ్యాటర్ 61 రన్స్ చేశాడంతే. దాంతో.. హిట్‌మ్యాన్‌కు వన్డే ప్రపంచకప్ అవకాశం ఇస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.
This is how Rohit Sharma chased 91 runs in 8 overs against Aus Hazelwood and Starc
That one bad Series can’t decide Legacy of Greatest Opener pic.twitter.com/C0Y4vxpka3
— RUC×H (@deAtHx__00) January 19, 2026