సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు వారాల క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం మృతి చెందగా, ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు.
ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు.
జయంత్ మృతితో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. బుధవారం సాయంత్రం జయంత్ అంత్యక్రియలు జరిగాయి.