న్యూఢిల్లీ: ఫ్యామిలీ బయ్యర్లే లక్ష్యంగా దేశీయ మార్కెట్‌కు ఓ సరికొత్త కారును కియా పరిచయం చేయనున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ నయా 7సీటర్ మోడల్‌ను తీసుకురానున్నట్లు కియా ఇండియా మంగళవారం తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో సెల్టోస్, సోనె ట్, కార్నివాల్ మోడళ్లను కియా విక్రయిస్తున్నది. ఈ క్రమంలో అమ్మకాలను మరింత పెంచుకోవడంలో భాగంగా కియా కేవై (కోడ్ నేమ్)ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. కాగా, వచ్చే నెల 16న ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్న సంస్థ.. జనవరి-మార్చిలో భారత్‌కు తెచ్చే వీలున్నది.