న్యూఢిల్లీ: చనిపోయినవారి ఆధార్‌ను ఆన్లైన్ ద్వారా డీయాక్టివేషన్ చేసే సదుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులో తెచ్చింది. మైఆధార్ పోర్టల్ ద్వారా మృతుల కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ పోర్టల్‌లో లాగిన్ అయ్యి అవసరమైన వివరాలను పొందుపరచి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి, విజ్ఞాపనను సమర్పించాలి. భారత దేశ డిజిటల్ పరిపాలన ప్రయాణానికి ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
అలాగే చనిపోయిన వారి ఆధార్ బ్యాంకింగ్, ఆస్తి, సంక్షేమ పథకాల కోసం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది ఆఖరి నాటికి ఇ-ఆధార్ మొబైల్ యాప్‌ను యూఐడీఏఐ అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ లాంటి కీలక సమచారాన్ని మన స్మార్ట్‌ఫోన్‌లోనే నవీకరించుకోవచ్చు.