టిరానా (అల్బేనియా): అల్బేనియాలోని కృత్రిమ మేధ (ఏఐ) జనరేటెడ్ మినిస్టర్ డియెల్లా మొట్టమొదటిసారి గురువారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ గవర్నమెంట్ మినిస్టర్. దీనిని గత వారం అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రమ నియమించారు. డియెల్లా (సూర్యుడు) మాట్లాడుతూ, రాజ్యాంగానికి నిజమైన ప్రమాదకారి యంత్రాలు కాదని, అధికారంలో ఉన్నవారు చేసే అమానుష నిర్ణయాలేనని చెప్పింది.
“నేను ఉన్నది మానవుల స్థానాన్ని భర్తీ చేయడానికి కాదు, వారికి సాయపడటానికే” అని చెప్పింది. తాను మానవుడిని కానందువల్ల తనను మంత్రిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని వస్తున్న విమర్శలపై డియెల్లా స్పందిస్తూ, “రాజ్యాంగాలకు నిజమైన ప్రమాదం యంత్రాలు ఎన్నడూ కాదు, అధికారంలో ఉన్నవారు తీసుకునే అమానుష నిర్ణయాలే” అని చెప్పింది.