న్యూఢిల్లీ, మే 15 : గత నెలలో దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం 5 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఏప్రిల్లో ఎగుమతులు 9.03 శాతం పెరిగి 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు 19.12 శాతం ఎగిసి 64.91 బిలియన్ డాలర్లకు చేరాయి.
దీంతో వాణిజ్య లోటు 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 26.42 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ముడి చమురు దిగుమతులు 25.6 శాతం ఎగబాకి 20.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం దిగుమతులు 3.09 బిలియన్ డాలర్లకు పెరిగాయి.