హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్ర మాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని భా విస్తున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగా యి. దట్టంగా పొగ కమ్ముకొని ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఉలికిపడ్డారు. ఫార్మా సెజ్‌లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు దవాఖానలకు తరలించారు. కాలిన గాయాలతో ఏడుగురు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడినవారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు సమాచారం. వీరి లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉ న్నట్టు సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమమొదటి అంతస్తు స్లాబు కూలిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.