
మహబూబ్‌నగర్, డిసెంబర్ 16 : సమాజం విప్లవాత్మక మార్పులు రావాలన్నా… అభివృద్ధి పనులు అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనలకు అనుభవం అతి ముఖ్యమైన అంశం. తమ జీవితం అంతా ప్రజా శ్రేయస్సు కోసం ఉద్యోగ ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకుంటూ తమ అనుభవాలను, ఆలోచనలను విశ్రాంత ఉద్యోగులు సమాజా అభివృ ద్ధి దిక్సూచిలా సూచనలు సలహాలు ఇస్తున్నారు. కలెక్టరేట్ లో దూరపు ప్రాంతాల నుంచి వచ్చే వారికి మేమున్నాం టూ సీనియర్ సీటిజన్స్, విశ్రాంత ఉద్యోగులు తమకు చేతనైనంత సహాయం చేస్తూ యూవతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేపథ్యంలో పెన్షనర్లకు సరైన గుర్తింపు అందించేందుకుగానూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆలోచనల నుంచి ఆవిష్కృతమైంది పెన్షనర్లకు ప్రత్యేక భవనం అందుబాటులోకి తీసుకురావాల్సిందన్నారు.
పెన్షనర్లకు ప్రభుత్వం అండ
పెన్షనర్లకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి స మస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆలోచిస్తున్నది. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పెన్షనర్లకు ఎల్లప్పుడు మేమున్నాంటూ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లో ఉచితంగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు జిల్లా కేంద్రంలోని వెం కటేశ్వరకాలనీలో 450 గజాల స్థలంలో రూ.20లక్షలు వె చ్చించి పెన్షనర్ల అసోసియేషన్‌కు నూతన భవనం నిర్మిస్తు న్నది. భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇటీవల శంకుస్థాపన చేశారు.
ఉమ్మడి జిల్లాలో 9,500 మంది పెన్షనర్లు
ఉమ్మడి జిల్లాలో 9,500 పైగా పెన్షనర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు వేలకు పైగా పెన్షనర్లు. పెన్షనర్ల కు ఎలాంటి సమస్యలు వచ్చిన వారి అందర్ని ఒకే దగ్గరకు చేర్చేందుకు నూతన భవనం ఎంతో ఉపయోగపడుతున్న ది. పెన్షనర్లు ఐక్యతగా ఉండేందుకు ఎంతో దోహదపడనుందని పలువురు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ భవనం లో ప్రపంచ పెన్షనర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని సీనియర్లు 20 మంది గుర్తించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఘనంగా సన్మానించనున్నారు. దీంతోపాటు వారి అనుభవాలను ఆలోచనలను తెలిపేలా కార్యక్రమం నిర్వహణ జరుగనున్నది.
చాలా సంతోషంగా ఉంది…
పెన్షనర్లను ఎవరు పట్టించుకునే పాపానపోలేదు. పెన్షనర్లకు ఎంతో అనుభవం ఉంటుంది, వారి అనుభవాలను తీసుకొని మన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుదామని చెప్పిన ప్రభుత్వం మనది. పెన్షనర్ల జీవితాలకు ఒక కుటుంబం భవనం ఏర్పాటు చేయడం అంటే మాకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతున్నదని అర్థం చేసుకుంటున్నాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన కృషి మా జీవితాతం గుర్తు పెట్టుకుంటాం.
-సాయిలుగౌడ్, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
తగిన గుర్తింపు లభించింది…
పెన్షనర్లకు ప్రత్యేక భవనం లేక టీఎన్జీవోఎస్ భవనంలో అసోసియేషన్ ప్రారంభించినప్పుటి నుంచి ఉంటున్నాం. మా సమస్యను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకుపోయిన వెంటనే మా ఆలోచనలకు మార్గం చూపారు. పెన్షనర్లకు అనుభవంతోపాటు ఆలోచన విధానం ఎంతో ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఎల్లప్పుడు రుణపడి ఉంటాం
-బాలకిషన్, పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు, మహబూబ్‌నగర్