నిజామాబాద్ : జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయ(Telangana University) పరిధిలో గురువారం జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా ( Exams postpone) వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ తెలిపారు. మిగిలిన పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.