Isha | నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు.. ‘ఈషా’ అందరినీ భయపెడుతుంది : బన్నీ వాసు
Isha | రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్రాజ్తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న‘ఈషా’ మూవీలో హెబ్బాపటేల్ హీరోయిన్గా నటిస్తోంది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
Isha | ఇటీవలే లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి కాంబో తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.
ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్రాజ్తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో హెబ్బాపటేల్ హీరోయిన్గా నటిస్తోంది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ ను గురువారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నిసినిమాలు చేసినా, నా ప్రతి సినిమాను తొలి సినిమాలా భావిస్తాను. ఈషా దర్శకుడు శ్రీనివాస్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి, ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టు ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు. నేను ఎప్పట్నుంచో చిన్న సినిమాలను ఆదుకునే వాళ్లు ఎవరైనా ఉండాలని… అనుకునేవాడిని. వాసు, వంశీ జర్నీ చూస్తే నాకు వాళ్లు చిన్న సినిమాలకు ఇస్తున్న ఆశ, సపోర్ట్ ఎంతో గొప్పది. డబ్బుంటే సినిమా చేయవచ్చు. కానీ ఆ సినిమాను థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారన్నారు.
బన్నీవాస్ మాట్లాడుతూ.. మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్ ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగానే ఈ సినిమాను జనాల్లోకి తీసుకవెళ్లడానికి కృషిచేస్తాం. విడుదల తేదీకి సమయం తక్కువగా ఉన్న మా ఎఫర్ట్ అంతా పెడుతున్నాం. నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్లో నాలుగు సార్లు భయపడ్డాను.
దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనపించింది. తెలిసి కూడా అందరిని భయపెట్టే సినిమా. అంటే భయపడతారని తెలిసినా భయపడతాం. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికి ఎంతో థ్రిల్‌ను కలిగిస్తుంది. చివరి 15 నిమిషాలు అందరి హృదయాలకు హత్తకుంటుంది. ఈ మధ్య కాలంలో అరవైకి పైగా సినిమాలు చేశాం. అందులో మూడు సినిమాలు సెలక్ట్ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఎవరి డబ్బులు వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్ ధర కూడా రీజనల్‌బుల్‌గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు అన్నారు.
నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నా..
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసి భయపడ్డాను. డిసెంబర్ 12న అందర్ని భయపెడుతున్నాం. మాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఇచ్చిన దామోదర ప్రసాద్, నిర్మాతలకు నా థాంక్స్. నేపథ్య సంగీతం అదిరిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ కావాలంటే అన్ని కుదరాలి. ఈ సినిమాకు అన్ని కుదిరాయని, అనుకూలించాయని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే మాకు మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. ఈ సినిమాను చాలా అద్బుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించాం. ఈ చిత్ర సమర్పకుడు దామోదర ప్రసాద్ నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమా విడుదల చేయడం మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగిందన్నారు.
సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
We are following #AlluAravind Garu’s footsteps. We are supporting and getting the benefit. That’s a win-win situation
– #BunnyVas at #Isha Glimpse Launch event
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 4, 2025
Read Also :
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

