చెన్నూర్ టౌన్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ( Protect trees) చెన్నూర్ సివిల్ కోర్టు జడ్జి ( Civil Judge) పర్వాతనేని రవి (Parvataneni Ravi) సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు, కోర్టు సిబ్బందితో కలసి జడ్జి రవి మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు, జీవరాశుల మనుగడకు, మానవాళికి చెట్లు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.