బడంగ్పేట్ : ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ( Sports Spirit ) పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ( MLA Sabita Reddy ) అన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో మార్వాడీ నాయకుడు ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్( Volleball) పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మార్వాడీ క్రీడాకారులను ఆమె అభినందించారు. క్రీడాకారులకు సౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేయడం అంతసులువు కాదన్నారు. క్రీడలను సజావుగా జరుపుకోవాలని సూచించారు.
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. ఒక్క ఓటమితో కృంగిపోవద్దని పేర్కొన్నారు. ఓటమి చెందిన క్రీడాకారులు మరింత శిక్షణ పొంది పట్టుదలతో విజయాలు సాధించాలని అన్నారు. కాగా మార్వాడీలు నిర్వహించిన వాలీబాల్ పోటీలకు పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో వివాదస్పదమయ్యింది. డీజేలు పెట్టడం పై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాద్యత వహించాలని పోలీసులు మార్వాడీలను ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, పుట్టగల్ల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.