తానూర్ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎస్సై షేక్ జుబేర్ అన్నారు. మండల కేంద్రంలో ఓంకార్ డే కేర్ హాస్పిటల్ డాక్టర్ చంద్రకాంత్ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని, అలాంటి దానాన్ని చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాడేవారు విఠల్, జాదవ్ మాధవరావు పటేల్, నాయకులు శివాజీ పటేల్, పుండ్లిక్, సదాశివ్ పటేల్, చక్రధర్ పటేల్, గోవింద్ పటేల్, గ్రామస్థులు పాల్గొన్నారు.