మారేడ్పల్లి, జనవరి 24: కంటోన్మెంట్ డిపోలో సోమవారం డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారేడ్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రనాయక్, డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి హాజరై ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్స్రూల్స్పై అవగాహన కల్పించారు. అనంతరం డిపోకు చెందిన పలువురు ఉత్తమ డ్రైవర్లను ట్రాఫి క్ ఎస్ఐ సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవర్లందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, డ్రైవ్ చేయాలని తెలిపారు. డిపోలో ఉత్తమ డ్రైవర్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం డిపో మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు సంస్థ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.