బాలీవుడ్ హీరో కునాల్ ఖేమూ, దర్శకుడు కేన్ ఘోష్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. గొప్ప పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కు వీరు అభినందనలు తెలిపారు.
కునాల్ ఖేమూ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘అభయ్ 3’. ఆశా నేగి, నిధి సింగ్, రాహుల్ దేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్లో పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కూనాల్ కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు కేన్ ఘోస్ తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కునాల్ ఖేమూ మాట్లాడుతూ…‘అభయ్ వెబ్ సిరీస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరింత ఆసక్తికరంగా సీజన్ 3 ఉంటుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో నటించడాన్ని ఆస్వాదించాను. దర్శకుడు ఎంతో శ్రమించి రూపొందించారు’అన్నారు. ఈ వెబ్ సిరీస్ హిందీ, తెలుగు, తమిళంలో ప్రసారం కానుంది.