Eshna Kutty | ‘జెండా పూల్’ పాటకు చీరకట్టులో హూలా హూప్ ఆడుతూ ఫేమస్ అయిపోయింది ఇష్నా కుట్టి. ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దీంతో ఏక్దమ్ స్టార్డమ్ వచ్చేసింది. దాంతోపాటే హూలా హూప్ ( Hula Hoop ) ఆట కూడా పాపులర్ అవుతున్నది. హూలా హూప్ చీరకట్టులోనూ ఆడొచ్చని నిరూపించింది ఇష్నా. తనకు చిన్నప్పటి నుంచీ ఈ ఆట అంటే ఇష్టం. ఇరుకిరుకు బెడ్రూమ్లో ఆరంభమైన సాధన ఫ్లోర్ ఆర్టిస్ట్‌గా ఎదిగిన తర్వాత వేల మంది సమక్షానికి విస్తరించింది. హూలా హూపింగ్ నేర్పడానికి ఇష్నా ఈ మధ్య హైదరాబాద్ వచ్చింది. అనుకున్నదాని కంటే ఎక్కువ మందే హాజరుకావడంతో ఒక సెషన్ పెంచాల్సి వచ్చింది. హూలా పట్ల పెద్దలు కూడా ఆసక్తి చూపేలా ఆమె ప్రయత్నిస్తున్నది. హైదరాబాద్ వర్క్‌షాప్‌కు తాతయ్యలు, అమ్మమ్మలు కూడా వచ్చారట. ఒక విద్యార్థి వయసు 65 ఏండ్లు!
సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”
అప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది.. ఇప్పుడు అవార్డులు అందుకుంటుంది”
“Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
“Mumbai Cafe Bambai Nazariya | ముంబైలోని ఈ కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!”