Errolla Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా అవినీతిమయం అయ్యిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్రైమ్ అని పిలుచుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో క్రైమ్ రేటు దాదాపు 18శాతం క్రైమ్ రేటు పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో శాంతికి చిరునామా అయితే.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన క్రైమ్ కు చిరునామాగా మారిందని విమర్శించారు. ఇవాళ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు.
గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుండే…ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర హోం శాఖ స్వయాన ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది అయినప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వహణ లేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి లేదు …భద్రత లేదని విమర్శించారు. ప్రజలకు శాంతి….రాష్ట్రంలో భద్రత లేదన్నారు. బీఆర్ఎస్ది అగ్రికల్చర్, కాంగ్రెస్ పార్టీ ది గన్ కల్చర్ అని మండిపడ్డారు. ఒకపక్క గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుపుతున్న సమయంలో మరోపక్క మిట్ట మధ్యాహ్నం హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. క్రైమ్ రేటు అంతకు అంత పెరుగుతుంది.గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అంతకు మించి పెరిగిందన్నారు.తెలంగాణ అంత కూడా సైబర్ క్రైమ్ సిటీగా మారిందని విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టే దృష్టి రాష్ట్రంలో శాంతి భద్రతలపై పెడితే క్రైమ్ రేటు తగ్గుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ హితవుపలికారు. పదేళ్ల కాలంలో తగ్గిన క్రైమ్ రేటు.. ఇప్పుడు పెరుగుతున్నది అంటే ఎవరి వైఫల్యమని ఆయన ప్రశ్నించారు. తప్పు అధికారులదా? పాలకులదా అని నిలదీశారు. ఆనాడు సంక్షేమ శాఖ ఇలానే నిర్వీర్యం చేశారని.. ఇప్పుడు మళ్లీ హోం శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గ్లోబల్ సమ్మిట్, ఏఐ సమ్మిట్ లు తప్ప మీరు చేసేది ఏం లేదని ఎద్దేవా చేశారు.