Foods For Iron | ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరమవుతూ ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలల్లో ఐరన్ కూడా ఒకటి. శరీరానికి ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇలా అనేక రకాలుగా ఐరన్ మనకు సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల మనం రక్తహీనతతోపాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది శరీరానికి కావల్సిన ఐరన్ ను పొందడానికి ఐరన్ సప్లిమెంట్స్ ను వాడుతున్నారు.
అయితే సప్లిమెంట్స్ కు బదులుగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావల్సినంత ఐరన్ ను పొందవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో పాలకూర ఒకటి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అలాగే పప్పుదినుసులను తీసుకోవడం వల్ల కూడా శరీరానికి కావల్సిన ఐరన్ తో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది. అదేవిధంగా కోడిగుడ్డులో కూడా ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. కోడిగుడ్డును తీసుకోవడం వల్ల ఐరన్ తో పాటు శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సాల్మన్ చేపలు కూడా ఒకటి. వీటిలో ఐరన్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక చికెన్ లో కూడా తగిన మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఐరన్ తో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది. చికెన్ తోపాటు మటన్ వంటి ఆహారాల్లో కూడా ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు కినోవా ధాన్యాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఐరన్ తో పాటు అమైనో యాసిడ్లు కూడా ఉంటాయి. కినోవా ధాన్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.
సోయాటోఫులో కూడా అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు సోయాటోఫును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. ఇక శనగలల్లో కూడా అధిక మొత్తంలో ఐరన్ ఉంటుందని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్ సహాజంగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత సమస్యలు రాకుండా ఉంటాయి.