యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు
స్వామివారిని దర్శించుకున్న శంశాక్ గోయల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శంశాక్ గోయల్ బుధవారం ఉదయం యాదాద్రిలో స్వామివారిని దర్శించుకొన్నారు. పునఃప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాదాద్రి ప్రధానాలయాన్ని తిలకించిన ఆయన మహాద్భుతమని కొనియాడారు.