EPFO | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో- EPFO) తన పీఎఫ్ సబ్స్క్రైబర్లకు రిలీఫ్ కలిగించే చర్యలు తీసుకోబోతున్నదని సమాచారం. ఈపీఎఫ్‌వో ( EPFO ) లో సభ్యులుగా ఉన్న ఆరు కోట్ల మంది ఖాతాదారులకు సరికొత్త సేవలు అందుబాటులోకి తెచ్చే చాన్స్ కనిపిస్తున్నది. తత్ఫలితంగా పీఎఫ్ సబ్స్క్రైబర్లు పలు బెనిఫిట్లు పొందుతారు. ఈపీఎఫ్‌వో ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ సర్వీసులకు తోడుగా హెల్త్‌కేర్ (Health Care), మెటర్నిటీ (Maternity), డిజెబిలిటీ ( Disability ) బెనిఫిట్లు (Benefits ) కూడా అందుబాటులోకి తేవాలని కసరత్తు చేస్తున్నది. ఈ విషయమై ఈపీఎఫ్‌వో ( EPFO ) ప్రాధమిక ప్రతిపాదన సిద్ధం చేసిందని సమాచారం.
పలు సామాజిక భద్రతా పథకాల (Social Security Schemes ) ను అమలు చేయడంలో అపార అనుభవం గల ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో వివిధ వర్గాల కార్మికులకు బేసిక్ సోషల్ సెక్యూరిటీ ( Basic Social Security ) కల్పించడానికి సిద్ధమవుతున్నది. దీనిపై ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ సంప్రదింపుల ప్రక్రియ కార్యాచరణ రూపం తీసుకుంటే ఈపీఎఫ్‌వో బేసిక్ సోషల్ ప్రొటెక్షన్ ఫ్లోర్ (ఎస్పీఎఫ్ – SPF) మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తుంది.
ప్రాథమిక ఆదాయ భద్రత ( Basic Income Security ) తోపాటు అత్యవసర హెల్త్ కేర్ ( Health Care) సేవల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుంది ఎస్పీఎఫ్. దారిద్య్ర నిర్మూలన ( Alleviating Poverty ), సామాజిక బహిష్కరణ ( Social Exclusion ) కు తావు లేకుండా, దుర్భలత్వం నుంచి రక్షణ కల్పించడమే ఎస్పీఎఫ్ లక్ష్యం. అందుకోసం ఆయా వర్గాల కార్మికులకు ప్రాథమిక సామాజిక భద్రత హామీ కల్పిస్తుంది.
తొలి దశలో 45 కోట్ల మందికి పైగా కార్మికులకు భద్రత కల్పించాలని ఈపీఎఫ్‌వో లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. అంటే 90 శాతం మంది అసంఘటిత రంగ కార్మికుల (Un organised Sector Labour ) భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల (International Laws) కు అనుగుణంగా జాతీయ చట్టాలు, నియమ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చి దేశ పౌరులు, పిల్లలకు అన్ని రకాల వసతులకు గ్యారంటీ కల్పించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో ILO ) సూచిస్తున్నది. ఇందుకోసం గత నెల 25,26 తేదీల్లో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ఈపీఎఫ్‌వో.. `విజన్ 2047` డాక్యుమెంట్ రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకున్నది.