– కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు
కోదాడ, ఆగస్టు 25 : మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, కౌన్సిలర్ చీమ నరేశ్ అన్నారు. మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులో వారు మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలను నాటడమే కాక సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణ సమతుల్యానికి, సకాలంలో వర్షాలు కురిసేందుకు మొక్కల సంరక్షణ అవసరమన్నారు. వార్డులో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు గోపి కాటమరాజు, స్వప్న, బాలేంద్ర, నాగేశ్వరరావు, రంగమ్మ, మెప్మా సభ్యులు, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.