– రాజు కొడుకు, కూతురు పేర రూ.8 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్
– కుటుంబ సభ్యులకు పత్రాలు అందజేత
నల్లగొండ, ఆగస్టు 25 : తన పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై చనిపోయిన రాజు రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. రాజు రెడ్డి స్వగ్రామం కట్టా అన్నారంలో ఆయన పార్ధీవ దేహాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి నేడు సందర్శించి నివాళులర్పించి కంచర్ల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యవచనాలు చెప్పి అండగా తాము ఉంటామని, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.

రాజు రెడ్డి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం : కంచర్ల భూపాల్ రెడ్డి
మూడున్నర సంవత్సరాల కుమారుడిని, ఏడాది పాపను చూసి నాయకులు చలించి, భావోద్వేగానికి గురయ్యారు. దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదంలో మరణించిన రాజును తాము తిరిగి తెచ్చి ఇవ్వలేమని కానీ, ఆయన పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చెరో రూ.4 లక్షలు మొత్తం రూ.8 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్‌లోనూ రాజు కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గోన రవీందర్రావు, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్, నల్లగొండ మండల అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్ పాల్గొన్నారు.

రాజు రెడ్డి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం : కంచర్ల భూపాల్ రెడ్డి