Vinosha Ravi: మంత్రి కీర్తన కాదు.. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలిసిపోయింది
Vinosha Ravi: ఓ మహిళ వీడియోను డీఎంకే ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఉన్న అసలు మహిళ ఎవరో తెలిసిపోయింది. మలేషియాలోని వినోషా రవి అనే మహిళ ఆ వీడయోలో ఉన్నట్లు గుర్తించారు. తనపై వస్తున్న కామెంట్లు భయపెడుతున్నాయని ఆమె అన్నారు.
చెన్నై: తమిళనాడులో ఓ వీడియో దుమారం రేపిన విషయం తెలిసిందే. నలుపు రంగు షార్ట్ డ్రెస్సు వేసుకున్న ఓ మహిళ కారు దిగిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోలో ఉన్న మంత్రి కీర్తన అంటూ డీఎంకే మద్దదారులు ట్రోలింగ్ చేశారు. కానీ ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని మంత్రి కీర్తన కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న అసలు మహిళ ఎవరో తెలిసిపోయింది. ఆ వీడియోలో ఉన్న మహిళ మలేషియాలోని వినోషా రవి(Vinosha Ravi) అని తెలిసింది. తన వీడియో పట్ల రాజకీయ దుమారం చెలరేగడంపై ఆమె స్పందించింది. సోషల్ మీడియా యూజర్లు తనను మంత్రి కీర్తనతో పోల్చడాన్ని ఆమె తప్పుపట్టింది.
తొలుత ఓ వ్యక్తి తనకు వీడియోను షేర్ చేశాడని, కానీ దాన్ని జోక్‌గా తీసుకున్నట్లు వినోషా రవి పేర్కొన్నది. కానీ ఆ అంశం సీరియస్ కావడం వల్ల.. కొంత ఆందోళనకు గురైనట్లు ఆమె చెప్పింది. ఆ ఘటన తనను డిప్రెషన్లోకి నెట్టివేసినట్లు పేర్కొన్నది. కొన్ని కామెంట్లు చాలా జుగుప్సాకరంగా ఉన్నట్లు తెలిపింది. దుస్తుల ఆధారంగా మహిళలను అంచనా వేయడం సరికాదు అని ఆమె అన్నారు. పోస్టింగ్ చేయడానికి ముందు యూజర్లు ఆలోచించరు అని తెలుస్తోంది, కేవలం వాళ్లకు వ్యూవ్స్ మాత్రమే కావాలి, ఇతర వ్యక్తుల ఆవేదన వాళ్లకు అర్థంకాదు అని అన్నారు.
బ్లాక్ షార్ట్ డ్రెస్సుతో ఉన్న వీడియోను తానేమీ సోషల్ మీడియాలో పోస్టు చేయలేదని, ఎవరో తన వీడియో తీసి పోస్టు చేశారని, అది కూడా మంత్రి కీర్తనకు ఆపాదించడం సరికాదు అని ఆమె అన్నారు. ఆ ట్రోలింగ్ గురించి తెలిశాక భయం వేస్తోందని, వర్క్‌కు కూడా వెళ్లడం లేదన్నారు. బెదిరింపులు, వల్గర్ మెసేజ్‌లు రావడంతో మలేషియా పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. ఆన్లైన్లో అటాక్ జరిగినంత మాత్రాన తన డ్రెస్సింగ్ స్టయిల్ మారదు అని ఆమె పేర్కొన్నారు.
It’s not the minister, it’s me!
A video mentioning Minister Keerthana has gone viral, and a young woman named Vinosha Ravi has released a video explaining the incident. She has also filed a complaint with the police regarding the incident
She was in a recent trending video!! pic.twitter.com/HS0uweEUsP
— Thara❤️ (@Thaaraaura) August 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

