ఇందిరమ్మ ఇండ్లలో అర్హులకున్యాయం చేయాలి
: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్స్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ ఆంశాలపై సమావేశం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి, లక్ష్మారెడ్డి డిమాండ్
మేడ్చల్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్స్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ ఆంశాలపై సమావేశం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి వివిధసమస్యలను దృష్టికి తీసుకొచ్చారు.
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణమెప్పుడో: బండారి
ఉప్పల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలు ఎప్పుడు చేస్తారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. తక్షణమే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నరెండు తహస్దీలార్ కార్యాలయాలు పూర్తిగా శిధిలావస్థకు చేరాయి.వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలైన తీసుకోవాలి లేదా బోర్లు వేసుకునేందుకు అనుమతినైనా ఇవ్వాలి.
అర్హులకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులలో అర్హులకు న్యాయం చేయాలి. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల్లో ఎల్‌వన్ జాబితాలో ఉన్న అర్హులకు రూ. 5 లక్షలు మంజూరు చేయాలి. ఎల్2 జాబితాలో ఉన్న వారికి పారదర్శకమైన లాటరీ విధానం ద్వారా ఇండ్లు కేటాయించాలి. జీవో 59 ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించిన వారికి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583 ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

