అగ్రివర్సిటీలో లైంగిక వేధింపులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసా య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై లైంగిక వేధింపులు, బెదిరింపు ఆరోపణలు రావడం కలకలం రేపింది.
- వీసీ అల్దాస్ జానయ్యపై ఉమెన్ సేఫ్టీ వింగ్, టాసా, గవర్నర్‌కు మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు
- రేవంత్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకం : మాజీ మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసా య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై లైంగిక వేధింపులు, బెదిరింపు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బాధితురాలు ‘ఉమెన్ సేఫ్టీ వింగ్’ (సాహస్ బృందం)కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గవర్నర్, తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్‌కు కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించారు. గతంలో జానయ్యను మార్గదర్శకుడిగా, తండ్రి సమానుడిగా భావించానని, అయితే ఆయన పదవిలోకి వచ్చాక తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు వా పోయారు.
ఆయన తరఫు బంధువును పెండ్లి చే సుకోవాలని ఒత్తిడి చేశారని, అంగీకరించకపోవడంతో వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2026 జనవరిలో పీహెచ్డీ డిప్యుటేషన్ పొడిగింపు కోసం తాను వీసీ చాంబర్‌కు వెళ్లినప్పుడు ఫోన్ బయట పెట్టించి, గది తలుపులు మూయిం చి, వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చే శారని ఆమె ఆరోపించారు. హర్యానాలోని హిసార్‌లో పీహెచ్డీ చేస్తుండగా అకడికి వచ్చి, తనకు లొంగకపోతే కెరీర్ నాశనం చేస్తాన బెదిరించారని ఆరోపించారు. బెదిరించినట్టుగానే నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌కు బదిలీ చేశారని తెలిపారు. వర్సిటీ కమిటీలపై నమ్మకం లేదని, అత్యంత గోప్యంగా ఉంచి న్యాయవిచారణ చేపట్టాలని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఆమె కోరారు.
విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తాం : టాసా
వీసీ జానయ్యపై బాధితురాలు తమకు ఫిర్యా దు చేసినట్టు తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్(టాసా) తెలిపింది. మూడు నెలలుగా ఆరోపణలు వర్సిటీలో ప్రచారం జరుగుతున్నాయని పేర్కొన్నది. అంతర్గతంగా విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని స్పష్టంచేసింది.
మహిళల భద్రత ప్రశ్నార్థకం: సబితాఇంద్రారెడ్డి
రేవంత్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకం గా మారిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు డీజీపీ నుంచి గవర్నర్ వరకు వినతిపత్రం ఇచ్చి పది రోజులవుతున్నా జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతున్నదని మండిపడ్డారు. వెంటనే వీసీపై చర్యలు తీసుకొని ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? : సత్యవతి
మహిళా ప్రొఫెసర్‌పై వీసీ లైంగిక వేధింపులకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసి పది రోజులవుతున్నా ఎఫ్ఐఆర్ ఎందుకు నమో దు చేయలేదని ప్రశ్నించారు. వీసీ కాంగ్రెస్ సానుభూతి పరుడైనందునే ప్రభుత్వ పెద్దలు కా పాడుతున్నారని విమర్శించారు.
కోర్టులను ఆశ్రయిస్తాం: లలితారెడ్డి
పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 2013 చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధి లలితారెడ్డి పేర్కొన్నారు. హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌కు న్యాయం జరుగకపోతే బీఆర్ఎస్ లీగల్ సెల్ కోర్టులను ఆశ్రయిస్తుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

