వాటర్ లాక్డౌన్ !
నగరంలో నీటి సంక్షోభం తారస్థాయికి చేరింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు. ముఖ్యంగా వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు ఆశ్రయం కల్పించే ప్రైవేటు హాస్టళ్లు, పీజీ రూమ్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాహకులు వాటర్ లాక్‌డౌన్‌కు సన్నద్ధమవుతున్నారు
- దాహంతో నగరం.. దిక్కుతోచని జనం
- తారస్థాయికి చేరిన నీటి సంక్షోభం
- ఎండిపోతున్న బోర్లు.. నిలిచిన ట్యాంకర్ల సరఫరా
- చేతులెత్తేస్తున్న హాస్టల్స్, పీజీ రూముల నిర్వాహకులు
- ప్రత్యామ్నాయాలు మరిచి.. జలమండలి పొదుపు మంత్రం
(నమస్తే తెలంగాణ)-సిటీబ్యూరో, నవంబర్ 4 నగరంలో నీటి సంక్షోభం తారస్థాయికి చేరింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు. ముఖ్యంగా వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు ఆశ్రయం కల్పించే ప్రైవేటు హాస్టళ్లు, పీజీ రూమ్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాహకులు వాటర్ లాక్‌డౌన్‌కు సన్నద్ధమవుతున్నారు. ఎక్కువ హాస్టళ్లు, పీజీ రూంలు ఉండే ప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులతో మూసివేస్తున్నారు. ఇక లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నివాసం ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలోని మరికొన్ని ఐటీ కారిడార్ ప్రాంతాలు, వేలల్లో ఉండే విద్యా, శిక్షణ సంస్థలు కలిగిన అమీర్‌పేట్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి వంటి ఏరియాల్లో నీటి ఎద్దడి పరాకాష్టకు చేరింది.
నగరం నీటి కటకటలతో అల్లాడిపోతున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో వందలాది అడుగులు వేసిన బోర్ల నుంచి నీరు రావడం లేదు. ప్రత్యామ్నాయంగా నీటి బోర్ల అన్వేషణపై యంత్రాంగం నియంత్రించడంతో ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు కూడా సరఫరా పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో… వాటర్ సమస్య తీవ్రమైంది. దీంతో హాస్టల్ నిర్వహణ రోజురోజుకు కష్టంగా మారడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కేవలం సైబరాబాద్ పరిధిలోనే సుమారు 2500కు పైగా ప్రైవేటు పీజీ హాస్టల్స్, కో లివింగ్ స్పేసులు, హాస్టళ్లు ఉన్నాయి. మాదాపూర్, మణికొండ, నార్సింగి, ప్రాంతాల్లో కొన్ని పెద్ద మల్టీ స్టోర్డ్ హాస్టళ్లలో 500-1000కిపైగా ఉంటారు. వీరికి రోజువారీ అవసరాల కోసం కనీసం 3-4 వాటర్ ట్యాంకర్ల నీరు అవసరం అవుతుంది. సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో యాజమాన్యాలు కూడా చేతులెత్తేస్తున్నారు. నగరవ్యాప్తంగా జలమండలికి రోజువారీ నీటి ట్యాంకర్ల బుకింగ్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. నిత్యం 8వేల పైగా బుకింగ్‌లు వస్తున్నాయంటే నగరంలో నీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలిసిపోతుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా కూడా 4-5 రోజుల వరకు కావడం లేదు. దీంతో మంచి నీటి అవసరాల తీవ్రత భారీగా పెరిగింది.
ఇండ్లకు వెళ్లిపోండి అంటున్న నిర్వాహకులు..
తాగునీరు, వంటగది అవసరాలు, స్నానాలు, ఇతర నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో హాస్టళ్ల నిర్వహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అశోక్ నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నీటికొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పలు రెసిడెన్షియల్ కాలేజీలు, విద్యా సంస్థలు, ప్రైవేటు హాస్టళ్ల నిర్వహకులు ముందస్తు సెలవులు ప్రకటించి ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆన్లైన్ తరహా విధానాలను పరిశీలిస్తామని చెప్పి మరీ విద్యా సంస్థలు నీటి ఎద్దడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించిన ఐటీ కంపెనీలు
నగరంలో విపరీతంగా పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటికే ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో వర్క్ ఫ్రం హోం అమలు చేయాలనే ప్రభుత్వం ఆదేశించడంతో నగరంలో పరోక్షంగా వాటర్ లాక్‌డౌన్‌కు తెరలేపింది. దీంతో క్రమంగా విస్తరిస్తున్న నీటి ఇబ్బందులతో ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు కరోనా లాక్డౌన్ తరహాలో ఆన్లైన్ మార్గాలను ముందుకు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే నారాయాణ, చైతన్య వంటి ప్రైవేటు కాలేజీల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని చెప్పి, వేలల్లో ఉండే విద్యార్థులను సొంతూళ్లకు పంపించేశారు. అదే బాటలో నగరంలో మరికొన్ని ప్రైవేటు హాస్టళ్లు కూడా నిర్వహించలేక, మూసి వేసి పరిస్థితికి చేరుకున్నాయి.

చేతులెత్తివేసిన వాటర్ బోర్డు
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న నీటి డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేయలేక వాటర్ బోర్డు పూర్తిగా చేతులెత్తేసింది. నీటి అవసరాలను తీర్చుకునే ప్రత్యామ్నాయాలను మరిచి పొదుపు మంత్రాలతో కాలయాపన చేస్తోంది. నగరంలో నీటి ఎద్దడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని యంత్రాంగం.. కేవలం ప్రైవేటు ట్యాంకర్లను నియంత్రించేలా వ్యవహరిస్తోంది. కానీ దీంతో నీటి సరఫరా మరింత తగ్గి నగరవాసులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని మరిచింది. ప్రైవేటు ట్యాంకర్లను నియంత్రిస్తే భూగర్భ జలాల నిల్వ పెరుగుతుందన్నట్లు తప్పుడు అంచనాలతో ఈ తరహా నిబంధనలు తీసుకువస్తున్నారే తప్పా..వాస్తవంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించడంలో వాటర్‌బోర్డు పూర్తిగా విఫలమైంది. ఇక రెయిన్వాటర్ హార్వెస్టింగ్‌పై ఇన్నాళ్లు దృష్టి పెట్టని యంత్రాంగం ఇప్పుడు ఉన్న ఫళంగా పొదుపు మంత్రంతో హడావుడి చేస్తున్నది.
హాస్టల్ నిర్వాహకుల ఆందోళన..
అమీర్‌పేట్:ఎస్ఆరనగర్, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, మధురానగర్, వెంగళ్రావునగర్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్ల నీటి అవపరాలు తీర్చడంలో ప్రైవేట్ ట్యాంకర్లే కీలకం. , ఇప్పుడు అవి నిలిచిపోవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అమీర్‌పేట్ జోన్ పరిధిలో దాదాపు 1200కు పైగా హాస్టళ్లు ఉన్నాయి. వేలాది మంది ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా హైడ్రా ప్రైవేట్ ట్యాంకర్లపై విధించిన నిషేధంతో నిర్వాహకులకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేట్ హాస్టల్ నిర్వాహకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.రాజారావు నేతృత్వంలో హాస్టల్ నిర్వాహకులు బుధవారం ఉదయం ఎస్ఆర్నగర్ జలమండలి కార్యాలయానికి తరలివచ్చి జీఎం వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇందుకు స్పందించిన జీఎం తాము నిబంధనల మేరకు హాస్టల్ నిర్వాహకులు బుకింగ్ చేసుక్ను ట్యాంకర్లను పంపగలమని, అదనపు నీటి ట్యాంకర్ల విషయమై తానేమీ చేయలేనంటూ జీఎం సతీష్ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని జలమండలి ఉన్నతాధికారులు, హైడ్రా వద్దే తేల్చుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో హాస్టల్ నిర్వాహకులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
ఓఆర్ఆర్ బయటి నుంచి మంచినీరు
భారీగా పెరిగిన వాటర్ డిమాండ్‌తో వాటర్ ట్యాంకర్ల యాజమానులపై హైడ్రా చేసిన దాడులతో నీటి సరఫరాను నిలిపివేసి సమ్మె చేస్తున్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే పరిస్థితి మరింత దిగజారడంతో… ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం, వాటర్ ట్యాంకర్ల ఓనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దాడులు నిర్వహించడం కేవలం నియంత్రణ కోసమే కాదని, నగరంలో భూగర్భ జలాలను పరిరక్షించాలనే ఉద్దేశమని చెప్పింది. కానీ ఓనర్లు మాత్రం హైడ్రా చేసిన దాడులతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్ లోపల భూగర్భ జలాలను తోడేందుకు వీలు లేదని, అవసరమైన ఓఆర్ఆర్ బయట నుంచి మంచినీటిని ట్యాంకర్ల ద్వారా నగరానికి తీసుకురావాలని ఆదేశించింది. దీనికి అంగీకరించిన నగర ప్రైవేటు ట్యాంకర్లు రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. అయితే బయట నుంచి నీటి తరలింపు పేరిట ప్రైవేటు ట్యాంకర్లు భారీగా డబ్బులు చేసే అవకాశం ఉందని, ట్యాంకర్ల బిల్లులు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే నగరవాసులపై మరో నీటి పిడుగు పడనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

