రీసైక్లింగ్‌పై నిర్లక్ష్యపు నీడ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ వ్యర్థాలనే సంపదగా మార్చి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం వైపు పరుగులు పెట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీ అండ్ డీ ( కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణతో పాటు వ్యర్థాల సేకరణలో విఫలమైంది. తద్వారా ట్రై కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చూసినా గుట్ట గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాల డంపింగ్ యార్డులు దర్శనమిస్తున్నాయి.
- గుట్టలుగా నిర్మాణ వ్యర్థాలు.. పట్టించుకోని అధికారులు
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ వ్యర్థాలనే సంపదగా మార్చి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం వైపు పరుగులు పెట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీ అండ్ డీ ( కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణతో పాటు వ్యర్థాల సేకరణలో విఫలమైంది. తద్వారా ట్రై కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చూసినా గుట్ట గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాల డంపింగ్ యార్డులు దర్శనమిస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీఅండ్ డీ) సమస్యకు శాశ్వత పరిషారంగా చేపట్టిన రీసైక్లింగ్ ప్రక్రియ అధికారుల తాత్సారంతో ఇప్పుడు మరో తీవ్ర సంక్షోభంలో పడింది. కొన్ని ప్లాంట్లలో వ్యర్థాలను శుద్ధి చేసి ఇటుకలు, రోబోశాండ్ , పేవర్ బ్లాకులు, టైల్స్ , కెర్బ్ స్టోన్స్ వంటి నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నప్పటికీ.. వాటి ధరలను ఖరారు చేయడంలో ఇంజినీర్ -ఇన్ -చీఫ్ (ఈఎన్సీ) అధికారుల కమిటీ జాప్యం చేస్తుండటం గమనార్హం. ఒకవైపు రీసైకిల్ చేసిన ఉత్పత్తులను తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు ఉన్నా.. మరోవైపు ధరలు నిర్ణయించకపోవడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది.
జీవో కాగితాలకే పరిమితమా
సీఅండ్‌డీ వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేస్తూ, రీసైకిల్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 19న జీఓ నంబర్ 626 జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని జీహెచ్ ఎంసీ, సైబరాబాద్ , మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పనులతో పాటు రోడ్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కనీసం 10 శాతం రీసైకిల్ సామగ్రినే వాడాలని నిర్దేశించింది.
అయితే క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు మాత్రం ధరల నిర్ణయంపై ఇంకా ‘కసరత్తు’ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాధారణ మారెట్ ధరలతో పోలిక, నాణ్యతా ప్రమాణాలు, రవాణా ఖర్చులు, సరఫరా విధానంపై ఇప్పటికీ స్పష్టత నివ్వకపోవడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వ విభాగాలు కొనుగోళ్లు జరపలేకపోతున్నాయి. క్యూర్ పరిధిలో రోజూ సుమారు 2,000 మెట్రిక్ టన్నుల సీఅండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నట్లు కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిని శుద్ధి చేసేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడ (రాంకీ, సోమా శ్రీనివాస్ ప్లాంట్లు), షామీర్ పేట, శంషాబాద్ ప్రాంతాల్లో రీసైక్లింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) నివేదిక ప్రకారం నగరంలోని మొత్తం ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 2,250 టన్నులకు చేరింది.
ఇప్పటివరకు ఈ ప్లాంట్లలో సుమారు 21.93 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రైవేటు రంగానికి చెందిన నిర్మాణాలు, ప్లాంట్లు సైతం అందుబాటులోకి వచ్చి నాణ్యమైన రీసైకిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. కానీ అధికారుల పర్యవేక్షణా లోపం, ధరల ఖరారులో జాప్యం కారణంగా ప్లాంట్లలో తయారైన సామగ్రి పేరుకుపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై ఆశలతో ముందుకు వచ్చిన ఉత్పత్తిదారులు, స్పష్టత కోసం ఎదురుచూస్తున్న బిల్డర్లు ఇప్పుడు తీవ్ర అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా ఈఎన్సీ కమిటీ స్పందించి తక్షణమే ధరలను ఖరారు చేయాలని, జీవో ప్రకారం రీసైకిల్ ఉత్పత్తుల వినియోగాన్ని వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు.
Hyderabad Struggles Mounting Construction Waste Recycling Plants Fail
Recycled Construction Product,C&D Recycling Plants,
Construction Demolition Waste
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

