న్యూఢిల్లీ, అక్టోబర్ 30: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శనివారం 22.62 లక్షల కోట్లు (302 బిలియన్ డాలర్లు). ఒక వ్యక్తి సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. బ్లూమ్బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ డెయిలీ ర్యాంకింగ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. లక్ష టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి హెర్ట్ కంపెనీ ఒప్పందం చేసుకోవడంతో టెస్లా షేర్ల ధర విపరీతంగా పెరిగాయి. దీంతో మస్క్ సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.75వేల కోట్లు(10బిలియన్ డాలర్లు) పెరిగింది. తద్వారా ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. మస్క్ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ 199 బిలియన్ డాలర్లు.