Elon Musk | అమెరికన్ టైకూన్, ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) సరికొత్త రికార్డును నెలకొల్పారు. వ్యక్తిగత సందప పరంగా మస్క్ ఏకంగా 600 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు (600 Billion Dollers Net Worth). తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి పెరగడం విశేషం.
వచ్చే ఏడాది స్పేస్ఎక్స్ (SpaceX) పబ్లిక్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని రాయిటర్స్ గత వారం నివేదించిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్లో మస్క్‌కు దాదాపు 42% వాటా ఉంది. ఈ సంస్థ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా వృద్ధి చెందింది. ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి సోమవారం మధ్యాహ్నం సమయానికి మస్క్ నికర సంపద దాదాపు 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ (Forbes) వెల్లడించింది. ఇక ఈ ఏడాది అక్టోబరులో మస్క్ (Elon Musk) నికర సంపద 500 బిలియన్ డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. 2022లో మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే దిగవుకు పడిపోయింది. ఆ తర్వాత మస్క్ సంపద పెరుగుతూ వస్తోంది. ఈ మూడేళ్లలోనే మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లు దాటడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు.
మరోవైపు కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న సీఈవోగా మస్క్ రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద (pay package) మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో గత నెల జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పే ప్యాకేజీలో కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.
మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ అందాలంటే ఆయన ముందు కొన్ని టార్గెట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ల డాలర్లుగా ఉన్నది. అయితే ఆ మార్కెట్ విలువను ఆయన 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుంది. స్వీయ డ్రైవింగ్ చేస్తున్న లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీ వాహనాలను ఆయన కమర్షియల్ ఆపరేషన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ అనుకుట్లే సాగితే, ప్రపంచ కుబేరుడు మస్క్ ప్రపంచంలోనే తొట్టతొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read..
Statue of Liberty | బలమైన గాలులు.. నేలకూలిన స్టాట్యూ అఫ్ లిబర్టీ.. VIDEO
UNSC | ఇమ్రాన్‌ను జైల్లో పెట్టి.. మునీర్‌కు సర్వాధికారాలా.. ఐరాసలో పాక్‌ను ఎండగట్టిన భారత్