Shah Rukh Khan | బీటౌన్ నుంచి బిగ్ అప్డేట్.. షారుఖ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్
Shah Rukh Khan | బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు షారుఖ్ ఖాన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
Shah Rukh Khan | బాలీవుడ్ నుంచి ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు షారుఖ్ ఖాన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మెగా మల్టీస్టారర్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) అధినేత ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వై.ఆర్.ఎఫ్. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘స్పై యూనివర్స్’ లోని తదుపరి భారీ చిత్రం ‘పఠాన్ 2’ లో ఎన్టీఆర్ ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘పఠాన్’ (షారుఖ్ ఖాన్) పాత్రను మరింత శక్తివంతంగా చేసేందుకు, కథను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఎన్టీఆర్‌ను సంప్రదించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రపై ఇండస్ట్రీలో భిన్నమైన చర్చ నడుస్తోంది. ఇది కేవలం పఠాన్ పాత్రకు సమాంతర ప్రధాన పాత్ర (Parallel Lead) గా ఉంటుందా, లేక స్పై యూనివర్స్‌లోనే అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడిగా (Formidable Antagonist) ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి ఇదే స్పై యూనివర్స్‌లో ‘వార్ 2’ చిత్రంలో నటించి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో ‘పఠాన్ 2’లో కూడా భాగం అయితే ఈ చిత్రం మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం కమిటయిన ‘కింగ్’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

