Mehreen | టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ ఫిర్జాదా మరోసారి వార్తల్లో నిలిచింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ భామ, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘F2’, ‘F3’ వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్లో మంచి స్థానం సంపాదించుకుంది. అయితే వరుస ఫ్లాపులు రావడంతో మెహ్రీన్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అదే సమయంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి హీరోయిన్ల ఎంట్రీతో అవకాశాలు మరింత తగ్గాయి. దీంతో కొంతకాలంగా మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉంటోంది.
ఒక దశలో తన కెరీర్ గురించి సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియోను కూడా షేర్ చేసి చర్చకు దారితీసింది. గతంలో భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం వరకు వెళ్లిన ఈ బంధం సడన్‌గా ముగియడంతో అప్పట్లో పెద్ద షాక్‌నే ఇచ్చింది. అనంతరం మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ప్రేమలో ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి. ఇక ఆ మధ్య ఓ పెయింటింగ్ ఫొటోను షేర్ చేస్తూ, ఇది కేవలం కళ కాదు… ఇది మనమే. మనం జీవించిన, ప్రేమించిన, కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని ఇది నిలుపుకుంటుంది అంటూ భావోద్వేగ క్యాప్షన్ జత చేసింది. ఆ పెయింటింగ్‌ను @artbysehgal రూపొందించాడని పేర్కొంది.
ఈ పోస్ట్‌తో మెహ్రీన్ , సెగల్ రిలేషన్లో ఉన్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. కామెంట్ సెక్షన్లో కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే తన పెళ్లి గురించి పలు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మెహ్రీన్ క్లారిటీ ఇచ్చింది. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాస్తున్నారు. అసలు అతడితో నాకు ఎలాంటి పరిచయం లేదు, వివాహం కూడా చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు తప్పక చెబుతా, నన్ను నమ్మండి అని మెహ్రీన్ క్లారిటీ ఇచ్చింది.