బూర్గంపహాడ్, ఏప్రిల్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి పల్లె ప్రకృతి వనంలో విద్యుత్ మోటారు చోరీకి గురైంది. దీనికి సంబంధించి పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ గుండి బాబూరావు, మహంకాళి రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీ చేసినట్లు తెలిపారు. దినచర్యలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పెట్టాలని వెళ్లిన సిబ్బందికి విద్యుత్ మోటారు చోరీకి గురైందని తెలిసి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా విద్యుత్ మోటారు అపహరణకు గురైందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. చోరీకి గురైన మోటారు విలువ రూ.30 వేలు ఉంటుందని తెలిపారు.