ఎవలో ఒకలు
అడుగులేస్తేనే బాట పడేది
తొవ్వల వడ్డ ముండ్లనేర్తేనే
ఎన్కొచ్చెటోళ్ళకు అల్కగయ్యేది
పదిమంది అనుసరిస్తేనే
తొవ్వ సక్కగయ్యేది…
వెళ్లేదారిలో
పూలు చల్లకున్నా సరే
గోతులు తీయకుంటే సరి
అటీటు మొక్కలు నాటకున్నా
పెరిగిన చెట్లు నర్కకు…
ఎవరికి చేటు చేయక
నీ తొవ్వల నువ్వెళ్లు
అభినందనలీయకున్నా
నిబంధనలు అతిక్రమించకు
ఆలస్యంగానైనా గమ్యం చేరు
ఆగమాగమై ఆగంజేయకు…
జాలి చూపి
దాన ధర్మం చేయకున్నా
వాళ్ల జోలికెళ్లి
జోలెను కాజేయకు..!
గంగాపురం శ్రీనివాస్
96763 05949