సుపురా స్వాత్ కునదికా
సుపురో మూషికాంజలిః
సుసంతుష్టః కాపురుషః
స్వల్పకే నాపి తుష్యతి
ఒక చిన్న నది కొలది నీటితోనే పొంగి పొరలినట్లుగా, చిన్న ప్రాణి అయిన ఎలుక దోసిలి కొంచెం ధాన్యంతోనే నిండిపోయినట్లు, కొద్ది లాభముతోనే కాపురుషుని యందు సంతోషం వెల్లివిరియును.
టి.సుధాకరశర్మ