అన్నపూర్ణ మాదునరయగ తెలగాణ
వడ్లు పండు నట్టి వజ్ర భూమి
ఊకదంపుడు గను నుట్టి నూకలు తిన
మతియు చెడియు చెప్పు మాటలేల?!
రైతు పంటల నిల రాజకీయము చేసి
కుటిల నీతి తోడ కొంగ జపము
కేంద్ర ప్రభుత నీవు కేలు ముడిచితివి
హాలికులకు హాని నాజ్య మగును!
రైతు మరియు మీకు వురి కాకముందరే
కొనుట వల్ల తలకు కొరవి తొలగు
రాజనాల నిచ్చు రైతు పొట్టను గొట్టిన
రాజ్య రమయు నికను రాదు సుమ్ము!
నూకలన్న వారు నూతిలో కప్పలు
వడ్ల పంటలు కొన తెడ్డు చూప
ముందు వుంది చూడము ముసళ్ళ పండుగ
రైతు దండు కదలు రాజధాని!
చేయి దాటి పొగ చేటు కల్గును మీకు
బువ్వ లేక ప్రజకు భుక్తి లేదు
ప్రజలు లేక దేశ పాలనం బెట్లగు?
రైతు వుసురు తోడ రాజ్య ముడుగు!!?
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493