న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ 44 చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ కింద సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మేఘాలయా, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరిగాయి. వీవోతో పాటు సంబంధిత కంపెనీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.