హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్(ఐఎంఎస్) కుంభకోణం కేసులో నిందితులకు సంబంధించిన రూ.144.4 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అటాచ్ చేసింది. అప్పటి డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి సహా కీలక నిందితులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఇండ్లు, విల్లాలు, నివాస స్థలాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో భాగంగా 2015-16, 2018-19 మధ్యకాలంలో రూ.211 కోట్ల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి, ఆస్తులు కూడబెట్టినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులంతా బెయిల్‌పై బయటే ఉన్నారు.