న్యూఢిల్లీ, జనవరి 31: పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏండ్లుగా ఉంది. 2013-17తో పోల్చితే 2014-18 మధ్యకాలంలో భారతీయుల సగటు ఆయుర్దాయం దాదాపు 5 నెలలు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 72.6 ఏండ్లు కాగా గ్రామీణ ప్రాంతాల్లో 68 ఏండ్లుగా ఉంది.