లక్నో, ఫిబ్రవరి 21: భారతదేశంలో ఉండాలంటే ‘రాధే రాధే’ అనాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మయంకేశ్వర్ శరణ్‌సింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మయంకేశ్వర్ మాట్లాడుతూ.. ‘దేశంలో ఉండాలంటే రాధే రాధే అనాల్సిందే.. లేకపోతే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించారు.