e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News మెల్లగా ఆహారం తినండి.. శరీరం బరువు తగ్గించుకోండి..!

మెల్లగా ఆహారం తినండి.. శరీరం బరువు తగ్గించుకోండి..!

మెల్లగా ఆహారం తినండి.. శరీరం బరువు తగ్గించుకోండి..!

దృఢమైన చక్కని ఆకృతిలో శరీరాన్ని సొంతం చేసువాలంటే.. డైటింగ్‌, వర్కవుట్స్‌.. రెండూ ముఖ్యమైనవే అని భావిస్తాం. ఉపవాసం, కష్టతరమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేకుండానే శరీరం బరువును తగ్గించుకోవడంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. నెమ్మదిగా తినండి అంటే చాలా మందికి కోపంగా ఉంటుంది. శరీరం బరువు తగ్గించుకోవడానికి ముందుగా ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమలడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఆహారాన్ని మెల్లగా తింటారు. అంతేకాదు కడుపారా తిన్న సంతృప్తి కూడా కలుగుతుంది. ఫలితంగా ఎక్కువగా తినకుండా ఉంటారు. ఎంత తింటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. డైటింగ్‌ చేయనప్పటికీ చిన్న ప్లేట్‌లో తినడం వల్ల ఎక్కువగా తిన్నామన్న భావన కలిగి తినే మోతాదు తగ్గిపోతుంది. భోజనం చేయడానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగాలి. దీంతో మీరు తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. మెల్లగా ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం బరువు తగ్గించుకోవడంతోపాటు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
మంచి పోషక శోషణ:
నెమ్మదిగా తినడం వల్ల మంచి జీర్ణక్రియ సాధించవచ్చు. శరీరం ద్వారా పోషకాలను గ్రహించడం కూడా గరిష్ఠంగా ఉంటుంది.
ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి:
నమలడం, ఆహార సంతృప్తి పెరుగడం ద్వారా ప్రశాంతమైన, సంతోషకరమైన మనసును పొందడానికి దారితీస్తుంది. ఇది తక్కువ స్థాయి ఒత్తిడిని సాధించడానికి నేరుగా దోహదం చేస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ:
నెమ్మదిగా తినడం వల్ల మరింత నమలడం అవసరం అవుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి తద్వారా శరీరం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
సంతృప్తి ప్రేరేపణ:
నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి వీలుంటుంది. తినడం ఎల్లప్పుడూ సరిపోకపోవచ్చు. అయితే దాని రుచి, వాసన, ఆకృతిని గుర్తించి అభినందిస్తున్నప్పుడు తినడం మరింత సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది.
నమలడాన్ని ప్రోత్సహిస్తుంది:
నెమ్మదిగా తినేటప్పుడు దంతాలతో నమలడం మెరుగుపడుతుంది. ఇది క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా శరీరం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
అదేవిధంగా, ఒత్తిడి, ఉద్వేగంగా ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తారు. ఒత్తిడికి లోనైన సమయాల్లో ఎక్కువగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌.. ఆకలిని పెంచుతుంది. బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఒక కారణంగా తేల్చారు. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల విడుదలలో అసమతౌల్యం ఏర్పడి ఊబకాయం సమస్య వస్తుంది. కాబట్టి కంటినిండా నిద్రపోవడం అలవర్చుకోవాలి.

Advertisement
మెల్లగా ఆహారం తినండి.. శరీరం బరువు తగ్గించుకోండి..!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement