Feel My Love | రాక్షసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది చెన్నై సుందరి అమ్ము అభిరామి. ఆ తర్వాత నారప్ప, రణ స్థలి, డెవిల్, రాజాసాబ్ సినిమాల్లో మెరిసింది. ఈ భామ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఫీల్ మై లవ్ (Feel My Love). ఆదిత్య భాస్కర్, ఐరా, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక లీడ్ రోల్స్‌లో నటించారు. హరి ప్రకాశ్ ఎం రచన, డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్ పార్థీబన్ విడుదల చేశారు.
అందమైన ప్రేమ ప్రయాణం మొదలు.. అంటూ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ అందరికీ టైటిల్ మాదిరిగానే ఫీల్ గుడ్ మూవీగా ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరుగొచ్చు.. అనే కాన్సెప్ట్‌తో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఎలిమెంట్స్‌తో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రానికి రాజా రవి వర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జీ ద్వయం మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎన్ బాలాజీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సన్నాహాలు చేస్తున్నారట టీం.
A beautiful journey of love begins! ♥️
Sri Lakshmi Jyothi Creations’ Production No. 1 is titled #FeelMyLove ✨@sLj_creations @ANBalaji6 @AadhityaBaaskar @RajAyyapamv #ayraa @Ammu_Abhirami @priyathimesh #noblekjames #subashkannan #MadhuSudhan #MSBaskar #cheran#HarriprakashM… pic.twitter.com/48dRe7twUk— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2026