మెక్సికోసిటీ: మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బందిని ఆమెతోపాటు మీడియాను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రజలు భూకంపంపై అప్రమత్తంగా ఉండాలంటూ నగరం మొత్తం హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ తీరంలో శాన్మాక్రోస్ పట్టణానికి సమీపంలో 35 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సం భవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.