
ఏన్కూరు, డిసెంబర్ 10: రైతులు పండించిన పంటలకు మెరుగైన ధరలు ఇవ్వడానికి, పారదర్శంగా మార్కెటింగ్ సేవలు అందించడానికి తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. మార్కెట్ యార్డుల పరిధిలో ఈ-నామ్ పద్ధతిని అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే ఈ విధానం అమలవుతున్నది. తాజాగా ఏన్కూరులోనూ ప్రారంభమైంది. ఈ మార్కెట్ భద్రాద్రి జిల్లాకు సమీపంలో ఉండడంతో ఆ జిల్లా రైతులు ఇక్కడ పంటలు అమ్ముకునే అవకాశం ఉన్నది. ఈ ప్రాంతంలో పత్తి, మిర్చి విస్తారంగా సాగు చేసే ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం ఏన్కూర్ మార్కెట్లో ఈ-నామ్ ప్రవేశపెట్టింది. మార్కెట్‌కు జిల్లాలోని తల్లాడ, కల్లూరు, కామేపల్లి మండలాల నుంచి కాక భద్రాద్రి జిల్లాలోని చండ్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్తో పాటు మండలాల నుంచి రైతులు పంటలు తీసుకువస్తారు. ఇక్కడ ఈ-నామ్ అమలుకు సౌకర్యాలూ ఉండడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు సులభంగా అమలు చేస్తున్నారు. ఏన్కూరు మండలంలో 25 పంచాయతీలు ఉండగా ఈ ఏడాది 8 వేల ఎకరాల్లో పత్తి, 13 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నది. మార్కెట్ యార్డులో 33 మంది ట్రేడర్లు ఉన్నారు. మార్కెట్ ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.2.50 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. ఈ-నామ్ విధానంపై ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతులు, వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగరాజు, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం ఈ-నామ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ-నామ్‌ను పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ పద్ధతిలపై ఇప్పటికే రైతులు, వ్యాపారులకు రెండుసార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. ఆన్లైన్ విధానంలో రైతులు ఏ రోజుకు కారోజు పంటల ధరలు తెలుసుకునే అవకాశం ఉన్నది. రైతులకు పారదర్శకంగా సేవలు అందుతాయి.
రైతులకు ఇవీ ప్రయోజనాలు..
ఈ-నామ్ పద్ధతిలో రైతులు తమ పంటను లోకల్ మార్కెట్లలోనే కాకుండా ఆన్లైన్లో ఇతర రాష్ర్టాల్లోని వ్యవసాయ మార్కెట్లకు ఆన్లైన్ ద్వారా విక్రయించవచ్చు. ఈ-నామ్లో రైతులు ఇతర మార్కెట్లలో అమలవుతున్న పంటల ధరలను తెలుసుకోవచ్చు. వారు అమ్మిన సరుకుకు ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ జరుగుతాయి. మార్కెట్ పరిధిలో రైతులు అధికారికంగా మార్కెట్శాఖకు చెల్లించాల్సిన రుసుము, ఫీజులు తెలుసుకునే అవకాశం ఉన్నది. తాక్ పట్టీ కూడా తీసుకోవచ్చు. రైతు ఖాతాలో జమ అయ్యే కచ్చితమైన మొత్తాన్ని ముందే తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు గంటల తరబడి వేచి ఉండి సరుకు అమ్ముకునే అవసరం ఉండదు. కేవలం కొన్ని గంటల్లోనే విక్రయాలు పూర్తవుతాయి. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు వచ్చిన ధరలకు రైతుకు సమ్మతి లేకపోతే విక్రయం నిలిచిపోయేలా విధానం ఉంటుంది. ఈ పద్ధతిలో వ్యాపారులు సిండికేట్ అయి రైతుల సరుకును అగ్గువకు కొనే విధానం ఉండదు. మోసాలకూ తావు ఉండదు.
అమలుకు ప్రణాళిక..
ఈ-నామ్‌ను పక్కాగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ పద్ధతిలపై ఇప్పటికే రైతులు, వ్యాపారులకు రెండుసార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. ఆన్లైన్ విధానంలో రైతులు ఏ రోజుకు కారోజు పంటల ధరలు తెలుసుకునే అవకాశం ఉన్నది. రైతులకు పారదర్శకంగా సేవలు అందుతాయి.
మోసాలకు తావు లేదు..
ఈ-నామ్ ద్వారా రైతులకు ప్రయోజనాలున్నాయి. ఈ పద్ధతిలో పంటల కొనుగోలు, అమ్మకాలు ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతాయి. తూకాల్లో మోసాలకు తావు ఉండది. ధరల విషయంలో అవకతవకలకు ఎలాంటి ఆస్కారం ఉండదు.