న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఏప్రిల్ 1 నుంచి బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) లావాదేవీల కోసం రూ.20 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ తప్పనిసరి. 2020 అక్టోబర్ 1 నుంచే రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న సంస్థలు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద బీ2బీ లావాదేవీల కోసం తప్పనిసరిగా ఈ-ఇన్వాయిస్ను తీస్తున్నాయి. గతేడాది జనవరి 1 నుంచి రూ.100 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్నవాటికి, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.50 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్నవాటికీ దీన్ని పొడిగించారు. ఈ క్రమంలో ఇప్పుడు రూ.20 కోట్లకుపైగా టర్నోవర్ ఉంటేచాలు ఈ-ఇన్వాయిస్ను తీయాల్సిందేనని కస్టమ్స్, పరోక్ష పన్నుల కేంద్ర బోర్డు కంపెనీలకు తెలిపింది.