కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ను ప్రపంచదేశాలు ప్రశంసిస్తున్నాయి..
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాతో పాటు యావత్ ప్రపంచం కూడా కరోనాపై పోరాటం చేస్తోందన్నారు. కోవిడ్ మొదలైన సమయంలో.. ఇండియా ఏమౌతుందని అందరూ చర్చించారని, ఇండియా వల్ల ప్రపంచంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో అని కూడా ఆందోళన చెందారని, కానీ 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ.. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఐటీ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు ఆయన చెప్పారు.
తొలి లాక్డౌన్ సమయంలో సుదీర్ఘ చర్చల తర్వాత చాలా కీలకమైన, ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్డౌన్ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. అది చాలా కీలకమైన నిర్ణయమన్నారు. దాని ఫలితంగా రికార్డు స్థాయిలో రైతులు పంటను పండించినట్లు మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి వేళ యువత దేశం గర్వపడేలా చేశారని, క్రీడా రంగంలో యువత రాణించినట్లు ఆయన తెలిపారు. మహమ్మారి ప్రభావం క్రీడలపై పడకుండా చూశారన్నారు. క్రీడాకారులు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చినట్లు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

