రామవరం, అక్టోబర్ 30 : మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ చీడపురుగును కూకటి వేళ్లతో పెకిలించాలని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ అన్నారు. చైతన్య (మాదకద్రవ్యాల పై యుద్ధం) కార్యక్రమాన్ని గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి .ప్రతాప్ ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బండి. శ్రీనివాస్, ఎస్సై సూర్యనారాయణ, కళాశాల సిబ్బంది, కానిస్టేబుల్స్ రమేష్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.