హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్‌హెచ్‌ఎస్) బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి రవూఫ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీకి టీజీజీడీఏ ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర మహిళా విభాగం అడ్వైజర్‌గా సీహెచ్ శ్రీలతరెడ్డి, చైర్‌పర్సన్‌గా స్వీతిఅనూప్, కో చైర్పర్సన్లుగా సంధ్యారాణి, పీ శోభారాణి, కో ఆర్డినేటర్‌గా సమత, కన్వీనర్‌గా ఝాన్సీ, సభ్యులుగా బింధుమాధవి, సీహెచ్ శిరీష, నళిని, ప్రతిభ లక్ష్మి, ఎన్ కీర్తన యాదవ్‌ను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు పీ కిషన్, వీ అశోక్ తెలిపారు.