ముంబై: పాల ప్యాకెట్లు డెలివరీ చేసే వ్యక్తి స్కూటర్పైకి కారు దూసుకెళ్లింది. దీంతో సంచిలోని పాల ప్యాకెట్లు రోడ్డుపై పడ్డాయి. ఆ కారు వాటిని తొక్కేయడంతో అక్కడి రోడ్డంతా పాలమయంగా మారింది. (Car Crushes Delivery Man’s Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోంధ్వాలోని ఎన్ఐబీఎం రోడ్డులో పాలు ప్యాకెట్లు అమ్మే వ్యక్తి అక్కడ పార్క్ చేసిన కారు పక్కన స్కూటర్ నిలిపాడు.
కాగా, ఒక వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. రోడ్డు డివైడర్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆగి ఉన్న స్కూటర్ మీదుగా కారును దూసుకెళ్లాడు. దీంతో స్కూటర్ ధ్వంసమైంది. దానికి ఉన్న సంచిలోని పాల ప్యాకెట్లు రోడ్డుపై పడ్డాయి. కొన్ని పాల ప్యాకెట్లను ఆ కారు తొక్కేయడంతో ఆ రోడ్డంతా పాలమయంగా మారింది. అయితే కొంత దూరంలో ఉన్న పాల ప్యాకెట్లు అమ్మే వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు.
మరోవైపు గమనించిన స్థానికులు ఆ కారును నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కారును గుర్తించి డ్రైవర్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pune Viral Video: Drunk Driver Crashes Into Divider, Wrecks Delivery Man’s Bike Near RIMS School On NIBM Road pic.twitter.com/0q7vfL6UaU
— Pune First (@Pune_First) March 17, 2025