న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ముర్ము మాట్లాడినట్లు తెలుస్తోంది. తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని ముర్ము ఆ ముగ్గురు నేతల్ని కోరినట్లు సమాచారం. ఇవాళ నామినేషన్ సమయంలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ముర్ముకు మద్దతుగా నిలిచారు. నామినేషన్‌కు ముందు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్, బిర్సా ముండా విగ్రహాలకు ముర్ము పూల నివాళి అర్పించారు.